Laali Laali Song Lyrical | Seetha Ramuni Kosam Movie Songs - Shweta Mohan Lyrics

Singer | Shweta Mohan |
Music | Anil GopiReddy |
Song Writer | Anil Gopireddy |
లాలి లాలి లాలి లాలి
బజ్జోరా నా బుజ్జాయి
లాలి లాలి లాలి లాలి
నిదురపో నా బంగారి
చిట్టి తల్లిని నిదురపుచ్చే
అమ్మ నేనై పాడనా అమ్మ కోసం అ
మ్మై వచ్చిన నీకు జోల పాడనా నిదురపోయి
లోకమంతా కనులుమూసే వేళ కలతలన్నీ
కరిగిపోయి కలలు చేరే వేళ లాలి లాలి లాలి లాలి
బజ్జోరా నా బుజ్జాయి లాలి లాలి లాలి లాలి
నిదురపో నా బంగారి దివిలోనంట బంగరు
స్వర్గమంట భువిలోనంట రంగులలోకమంట
వెలుగులన్నీ దీపాలై మా ముంగిటే నిలిచెలే
అంతులేని ఆనందాలే గుండెలో ఒదిగేలె
ఏ బంధమంటు లేని నాకు ఆత్మ బంధువు
దొరికెలే ఆ రాముడై నా తోడునిలిచి దీవెనే
ఇచ్చెలే ఈ జన్మకీ నువ్వుతోడుగా ఉండగా చాలులే
లాలి లాలి లాలి లాలి బజ్జోరా
నా బుజ్జాయి లాలి లాలి లాలి లాలి
నిదురపో నా బంగారి కలలోనంట వింతల
లోకమంట ఆ లోకానికి నువ్వు రాణిలా ఏలమంట
నీకోసం జాబిలే బంతిగా మారులే వెన్నెలే
నీ తోడుగా నేస్తమై చేరులే మబ్బులన్నీ
పానుపల్లే నిన్ను ఊయలలూపగా చుక్కలన్నీ
నీ చెక్కిల్లకు మెరుపులై చేరగా ఆ కన్నయ్యే
నీ కోసం వేణువై పాడగా
లాలి లాలి లాలి లాలి బజ్జోరా నా బుజ్జాయి
లాలి లాలి లాలి లాలి నిదురపో నా బంగారి
/>