Uppena - Nee Kannu Neeli Samudram Lyrical | Panja Vaisshnav Tej,Krithi Shetty |Vijay Sethupathi|DSP - Javed Ali Lyrics

Singer | Javed Ali |
Music | Devi Sri Prasad |
Song Writer | Shreemani |
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
నల్లనైన ముంగురులే.. ముంగురులే
అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే..
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని
లేకుండా కప్పాయిలే…
ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే.
జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే.
అల్లుకుంది వానజల్లులా ప్రేమే…
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
చిన్ని ఇసుక గూడు కట్టినా..
నీ పేరు రాసి పెట్టినా,
దాన్ని చెరిపేటి కెరటాలు.. పుట్టలేదు తెలుసా…
ఆ గోరువంక పక్కన, రామ చిలుక ఎంత చక్కనా..
అంతకంటే చక్కనంట.. నువ్వుంటే నా పక్కనా…
అప్పు అడిగానే.. కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ..
చెప్పలేమన్నాయే… ఏ అక్షరాల్లో ప్రేమనీ…
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
నీ అందమెంత ఉప్పెన.. నన్ను ముంచినాది చప్పున..
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా…
చుట్టూ ఎంత చప్పుడొచ్చినా… నీ సవ్వడేదో చెప్పనా..
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా…
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని..
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని…
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ…..
/>